ఇది శారద తన పెళ్ళిచూపుల కోసం తీయించుకున్న ఫోటో. అంటే ఇది 1990లలో తీయించుకున్నది కావాలి. ఒకప్పుడు పద్మజకు ఈఫోటోను శారద ఇచ్చిందట. పద్మజ అంటే మాతమ్ముడు కృష్ణ భార్య. శారద నిర్యాణానంతరం ఒకసారి కృష్ణ ఇంటికి వెళ్ళినపుడు పద్మజ ఈఫోటోను వాట్సాప్ ద్వారా పంపించింది నాకు. చూడవయ్య రామ సుదతి చక్కదనము చూచి మెచ్చి యామె శోభ నాడు పెండ్లియాడి నాను వేడుక ముప్పది మూడు వత్సరముల ముగిసిపోయె
Comments
Post a Comment