Posts

Showing posts from November, 2025

కొన్ని కొన్ని

Image
  కడుపు నిండిపోవు కమలాక్షి నీరీతి కనుచునుండ నాకు కమలనయన కనుల నీరు నించుకొని యామె స్మృతులను పదిలపరతు రామభద్ర యింక

నేను - శారద

Image
  (picture taken in 2014) శ్రీరామా నాజీవిత మేరీతిగ నడుప నెంతు వెట్లెఱుగుదురా శారద నిచ్చిన దీవే తీరినదా భోగ మన్న దేవుడ వీవే

పెళ్ళిచూపుల కోసం శారద తీయించుకున్న ఫోటో

Image
  ఇది శారద తన పెళ్ళిచూపుల కోసం తీయించుకున్న ఫోటో. అంటే ఇది 1990లలో తీయించుకున్నది కావాలి. ఒకప్పుడు పద్మజకు ఈఫోటోను శారద ఇచ్చిందట. పద్మజ అంటే మాతమ్ముడు కృష్ణ భార్య. శారద నిర్యాణానంతరం ఒకసారి కృష్ణ ఇంటికి వెళ్ళినపుడు పద్మజ ఈఫోటోను వాట్సాప్ ద్వారా పంపించింది నాకు. చూడవయ్య రామ సుదతి చక్కదనము చూచి మెచ్చి యామె శోభ నాడు పెండ్లియాడి నాను వేడుక ముప్పది మూడు వత్సరముల ముగిసిపోయె